రీషూట్ దిశగా కేరాఫ్ సూర్య
- November 18, 2017
ఓ సినిమా హిట్ కాకపోతే ... ఆ చిత్ర యూనిట్ అంతా నిరాశ చెందుతుంది. కొన్ని సార్లు నిర్మాతలకు లాస్ కూడా వస్తుంది. కానీ థియేటర్స్ లో సినిమా స్ర్కీనింగ్ మాత్రం ఉంటుంది. డైరెక్టర్ సుశీంద్రన్ ఇటీవల తెరకెక్కించిన తమిళ్ ఫిల్మ్ నెంజిల్ తునివిరుందాల్...తెలుగులో కేరాఫ్ సూర్య. ఇందులో హీరో సందీప్ కిషన్. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా రిలీజైంది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ ట్రాక్ అందుకోలేదు. దీంతో డైరెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం థియేటర్స్ తో స్క్రీనింగ్ కి అనుమతి ఉన్న అన్ని థియేటర్స్ నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు.
సందీప్ కిషన్, మెహరీన్ జంటగా నటించిన ఫిల్మ్ కేరాఫ్ సూర్య. రిలీజైన రోజు నుంచే సినిమాకు మంచి స్పందన రాలేదు. దీంతో డైరెక్టర్...హీరోయిన్ ఉన్న 20 నిమిషాల సీన్స్ ను కత్తెరించి మరి రిలీజ్ చేశారు. అయినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో డైరెక్టర్ ఇప్పుడు ఉపసంహరించుకొని...కొన్ని సీన్స్ రీషూట్ చేసి మళ్లీ రిలీజ్ చేసే పనిలో పడ్డాడట. హీరోయిన్ తో ఉన్న నిడివిని కట్ చేయడం...థియేటర్స్ ను సినిమా ఉపసంహరించుకోవడం అనేది కనీవినీ ఎరుగని సంగతి. బహుశ ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. కొత్త సీన్స్ యాడ్ చేసి మళ్లీ డిసెంబర్ 15న రిలీజ్ చేసి చీకట్లో ఉన్న సూర్యుడుని వెలుగులోకి తెస్తారట. మరి ఈ కొత్త సూర్య కిరణాలు ప్రేక్షకులని తాకుతాయో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







