పక్షి ఢీ తిరిగి ల్యాండ్ అయిన విమానం

- November 18, 2017 , by Maagulf
పక్షి ఢీ తిరిగి ల్యాండ్ అయిన విమానం

టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో గోఎయిర్‌కు చెందిన విమానం వెనక్కి వచ్చింది. న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పట్నా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుంది. న్యూదిల్లీలో విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు గోఎయిర్‌ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విమానాన్ని తిరిగి పైలట్‌ దింపివేసినట్లు పేర్కొంది. ఆ సమయంలో 174 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులను వెంటనే మరో విమానంలో పట్నా తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com