డ్రైవర్ లేని కారును టెస్ట్ చేసిన జాగ్వర్
- November 18, 2017
బ్రిటన్‌కు చెందిన అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ జాగ్వర్ లాండ్ రోవర్ (జెఎల్ఆర్) తొలిసారిగా రూపొందించిన డ్రైవర్ రహిత కారును లండన్ రోడ్లపై పరీక్షించింది. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం వెల్లడించింది. రెనాల్ట్ కారు నుంచి స్వీకరించిన పాడ్‌తో తొలి స్వయం ప్రతిపత్తి గల కారును జెఎల్ఆర్ రూపొందించింది. దీనిని పరీక్షించడం వల్ల స్వీయ చోదక వాహనాలు ఇతర కార్లతో ఎలా అనుసంధానం అవుతాయో అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు జెఎల్ఆర్ తెలిపింది. ట్రాఫిక్ లైట్ల వంటి రోడ్లపై ఉన్న మౌలిక సౌకర్యాలపై డ్రైవర్ రహిత వాహనాలు ఎలా స్పందిస్తాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవ డానికి వీలవుతుందని తెలిపింది. బహుళ సెన్సార్ల నుండి సమాచారాన్ని ఉపయోగి ంచడం ద్వారా, డాటాను ప్రాసెస్ చేయడానికి తెలివైన మార్గాలను కనుగొనడం ద్వారా, ఈ సాంకేతికతల ఆటోమోటివ్ అప్లికేషన్‌కు ఆద్యులుగా ఉండటానికిఅవసరమైన ఖచ్చితమైన సాంకేతికతను తాము పొందుతామని కంపెనీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిక్ రోగర్స్ తెలిపారు. లండన్‌లో కార్ల పరిశ్రమకు గుండెకాయ లాంటి కావెంట్రీ నగరంలో ఈ పరీక్ష నిర్వ హించినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది కూడా కారును పరీక్షిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష