పరారీలో వెనిజులా ప్రతిపక్ష నేత ఆంటానియో లెదెజ్మా
- November 18, 2017
ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో గృహనిర్బంధం ఎదుర్కొంటున్న వెనిజులా ప్రతిపక్ష నేత ఆంటానియో లెదెజ్మా శుక్రవారం పరారయ్యారు. సరిహద్దు గుండా ఆయన కొలంబియాకు పారిపోయారు. కొలంబియా సరిహద్దు నగరం కుకుతా సమీపంలోని వంతెన దాటడానికి ముందు మీడియాతో మాట్లాడారు. ''నేను ఎక్కడికి వెళ్లానో తెలీక నా కుమార్తె, భార్య చాలా ఆందోళన చెంది వుంటారు. వారు నన్ను అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. కొలంబియాకు వెళ్లాలనేది పూర్తిగా నా సొంత నిర్ణయం'' అని చెప్పారు. తిరుగుబాటు ఆరోపణల నేపథ్యంలో లెదెజ్మాను 2015 నుంచీ కారకాస్‌లో గృహనిర్బంధంలో వుంచిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కొలంబియాకు పారిపోయిన ఆయన రాత్రికిరాత్రే స్పెయిన్‌కు వెళ్లే ఆలోచనలో వున్నట్లు సమాచారం. ఆయన పరారీపై వెనిజులా అధ్యక్షుడు మదురో స్పందించారు. ''ఆ రక్తపిపాసిని కొలంబియా స్నేహితులు మళ్లీ వెనక్కి పంపించరనే ఆశిస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు. మాడ్రిడ్ నగరంలో 'రక్తపిపాసి' తిరుగుతోందని, నగర ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని మదురో విమర్శించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష