చిరంజీవిని చూపించమని అడిగిన దర్శకుడు బాబీ తండ్రి

- November 19, 2017 , by Maagulf
చిరంజీవిని చూపించమని అడిగిన దర్శకుడు బాబీ తండ్రి

అనుకోకుండా పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం అందుకొన్న బాబీ.. ఇటీవల ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా తో సూపర్ హిట్ అందుకొన్నాడు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకొన్నాడు.. మా నాన్నగారు చిరంజీవికి పెద్ద ఫ్యాన్.. చిరంజీవి సినిమా రిలీజైతే మొదటి రోజే ఆ సినిమా చూసేవారు.. నన్ను కూడా ఆయన సినిమాలకు తీసుకెళ్ళేవారు.. నాకోసం నాన్న వీధి చివరకు ముందుగా వెళ్ళి.. ఆ తర్వాత నన్ను రమ్మనమని చెప్పేవారు.. నేను ఇంట్లో స్కూల్ కి వెళ్తున్నట్లు చెప్పి.. బయలుదేరి... బయటకు వచ్చి.. నాన్న తో కలిసి చిరంజీవి సినిమాకు వెళ్ళేవాడిని అని చెప్పాడు.. అలా చిన్నతనంలో నాన్నతో ఎక్కువగా చిరంజీవి సినిమాలు చూశాను అని బాబీ గుర్తు చేసుకొన్నాడు. కొంత కాలం క్రితం నాన్న ఆరోగ్యం క్షీణించినపుడు... "ఏరా నేను చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూపించా... నువ్వు ఇప్పుడు దర్శకుడు అయ్యావు.. మరి ఇప్పుడు నాకు చిరంజీవిని చూపించవా.." అని అడిగారు.. అలా నాన్న అడిగేసరికి నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే వినాయక్ కి ఫోన్ చేసి.. నాన్న కోరిక చెప్పా... వెంటనే.. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నా బాబీ చెప్పరు. జై లవకుశ విడుదల రోజే చిరంజీవి గారు మాఇంటికి వచ్చి.. సరదాగా గడిపారు.. చిరంజీవి గారితో మా నాన్నగారు గడిపిన సమయం నేను మా నాన్నకు ఇచ్చిన బహుమతి అని బాబీ చెప్పాడు..  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com