హైదరాబాద్లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
- November 19, 2017
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తరువాత గాంధీభవన్, ఇందిరా భవన్లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేశారు. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణలు అమలు చేసిన ఇందిర దేశానికి చేసిన సేవలు మరువలేనివని నేతలు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో.. ఏపీ, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్, కేవీపీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







