చిరు తో దాసరి తనయుడు
- November 19, 2017
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సై రా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. డిసెంబర్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్ లాంటి నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పుడు మరో నటుడు ఇందులో చేరాడు. ఎప్పటి నుండో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న దాసరి నారాయణ రావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ సైరాలో ఓ ముఖ్య పాత్రకి ఎంపికయ్యాడనే టాక్ వినిపిస్తుంది. దర్శక రత్న దాసరి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన దాసరి అరుణ్ హీరోగా విజయం సాధించలేకపోయాడు. ఇప్పుడు ఈ రీఎంట్రీలో ఏమౌతుందో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







