అదృశ్యమైన జలాంతర్గామి నుంచి 7 మిస్డ్ కాల్స్

- November 19, 2017 , by Maagulf
అదృశ్యమైన జలాంతర్గామి నుంచి 7 మిస్డ్ కాల్స్

బ్యూనస్ ఎయిర్స్ : దక్షిణ అట్లాంటిక్‌లో అదృశ్యమైన అర్జంటైనా జలాంతర్గామి నుంచి 7 శాటిలైట్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. వేర్వేరు స్థావరాలకు ఈ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న ఈ జలాంతర్గామి అదృశ్యమైంది. దీనిలో 44 మంది సిబ్బంది ఉన్నారు.
అర్జంటైనా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ 7 శాటిలైట్స్ కాల్స్ నేవీ బేసెస్‌తో అనుసంధానం కాలేదని తెలుస్తోంది. కానీ జలాంతర్గామిలోని సిబ్బంది సంబంధాలను పునరుద్దరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్‌లో ప్రత్యేకతగల అమెరికా కంపెనీ సహకారంతో ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 ఉదయం 10.52 గంటల నుంచి మధ్యాహ్నం 3.42 గంటల మధ్యలో ఈ సిగ్నల్స్ వచ్చాయి. జలాంతర్గామి చివరిసారి దక్షిణ పటగోనియాలోని శాన్ జోర్జ్ గల్ఫ్ ప్రాంతంలో కనిపించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com