ఓ నటి జీవిత కథే 'జూలీ 2'

- November 19, 2017 , by Maagulf
ఓ నటి జీవిత కథే 'జూలీ 2'

ముంబయి: దక్షిణ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న నటి రాయ్‌లక్ష్మి టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం 'జూలీ 2'. ఈ చిత్రానికి పంపిణీదారుగా పహ్లాజ్‌ నిహ్లానీ వ్యవహరిస్తున్నారు. అయితే 1990-2000 మధ్య చిత్ర పరిశ్రమలో రాణించిన ఓ నటి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నిహ్లానీ వెల్లడించారు. ఆమె పేరు బయటపెట్టమని, పెడితే సినిమా విడుదల ఆగిపోతుందని పేర్కొన్నారు. అయితే ఆమె హిందీ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారని, ఓ సూపర్‌స్టార్‌తో నటించారని తెలిపారు. ఆ తర్వాత ఆమె కెరీర్‌ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో కొనసాగిందని పేర్కొన్నారు.
వచ్చే శుక్రవారం 'జులీ 2' విడుదలైన తర్వాత ఏ నటి పాత్రను రాయ్‌లక్ష్మి పోషించారో తెలుస్తుందని ఆయన చెప్పారు. ఈ సినిమాను చూసిన ఆమె తనను తాను గుర్తుపట్టి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏదేమైనప్పటికీ ఆమె పేరును ఏ విలేకరుల సమావేశంలోనూ బయటపెట్టమని స్పష్టం చేశారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ ఇబ్బందికరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com