యాభై ఏళ్ళ నాటి సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ నిరవధికంగా మూసివేత
- November 19, 2017
జెడ్డా : పురాతన చమురు శుద్ధి కర్మాగారం మూతపడింది. పర్యావరణ సమస్య ఉండటంతో జెట్డాలో రోజుకు 90,000 బ్యారెల్ ముడి చమురు శుద్ధి చేసే సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ కర్మాగారాన్ని నిరవధికంగా మూసివేశారు. జెడ్డాకు చెందిన పారిశ్రామిక వర్గాల సమాచారం మేరకు ఈ సంగతి వెలుగులోనికి వచ్చింది. ఆ కర్మాగారం కాలం చెల్లడం మరియు పర్యావరణv ఆందోళనల కారణంగా రిఫైనరీని మూసివేయడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1967 లో ఆరంభమైన ఈ చమురుశుద్ధి కర్మాగారం దేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగం తన విలువైన సేవలను అందించింది. ఈ మూసివేత కారణంగా ఇతర సౌదీ చమురుశుద్ధి కర్మాగారాల వద్ద డిమాండ్ పెరుగుతుంది. సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ ద్రవీకృత పెట్రోలియం వాయువు, గ్యాసోలిన్, డీజిల్, తారు మరియు జెట్ ఇంధనం మరియు నఫ్తాలను సమర్ధవంతంగా ఎగుమతి చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష