చింతచిగురు పులిహోర
- November 19, 2017
కావలసినవి: బియ్యం - 2 కప్పులు, చింతచిగురు - కప్పు, శనగపప్పు - టేబుల్ స్పూన, మినప్పప్పు - టేబుల్ స్పూన, ధనియాలు - టేబుల్ స్పూన, ఎండుమిర్చి - 4, నువ్వులు - టేబుల్ స్పూన, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు.
తయారీ: చింత చిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. వీలైతే కాస్త ఎండలో పెడితే మంచిది. తరువాత కాస్త నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు వేసి వేయించాలి. చివరగా ఎండుమిర్చి కూడా వేసి వేయించి దించాలి. చల్లారిన తర్వాత వీటితోపాటు చింతచిగురు కూడా మిక్సీలో వేసి పొడి చేసి ఉంచాలి. అన్నం ఉడికించి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. తరువాత చింతచిగురు పొడి, ఉప్పు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేగాక ఉడికించిన అన్నం వేసి కలిపి దించాలి. అంతే, టేస్టీ టేస్టీ పులిహోర రెడీ!
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి