నడుం నొప్పి వేధిస్తే ఇలా చేయండి..
- November 20, 2017
గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి నూనెతో నడుమూ, వెన్ను ప్రాంతాల్లో నెమ్మదిగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పితోపాటూ ఒత్తిడి కూడా తగ్గుతుంది.
నొప్పి తగ్గేవరకు ప్రతిరోజూ కొన్ని వారాలపాటు చేయాలి. సరైన పద్ధతిలో పడుకోకపోవడం వల్ల కూడా వెన్నునొప్పి బాధిస్తుంది. ఒకవేళ మీరు వెల్లకిలా పడుకోవాలనుకుంటే మీ మోకాళ్ల కింద తలగడను తప్పకుండా పెట్టుకోవాలి. ఒకవైపు తిరిగి పడుకోవాలనుకుంటే రెండు మోకాళ్లను మడిచి వాటి మధ్యలో తలగడను పెట్టుకోవాలి.
వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి కాపడం పెట్టుకోవడం వల్ల నడుం నొప్పి చాలామటుకూ అదుపులోకి వస్తుంది. కొన్ని ఐసు ముక్కలను లేదా చల్లటి కూరగాయల ప్యాకెట్‌ను ఒక తువాలులో చుట్టి దాంతో నడుంపై నెమ్మదిగా 15-20 సార్లు రుద్దినట్టు చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాయామాలు కూడా నడుము నొప్పిని చాలామటుకూ అదుపులోకి తెస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష