భాగ్యనగరం బిచ్చగాళ్లు ..అమెరికాలో గ్రీన్ కార్డులు

- November 20, 2017 , by Maagulf
భాగ్యనగరం బిచ్చగాళ్లు ..అమెరికాలో గ్రీన్ కార్డులు

అగ్రరాజ్య అధినేత కూతురు ఇవాంకా భాగ్య నగరాన్ని సందర్శించబోతున్నారు. భాగ్య నగర బతుకు చిత్రాన్ని అందంగా చూపించాలన్న ప్రయత్నంలో పోలీసులు బిచ్చగాళ్లను నగర శివార్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో బిచ్చగాళ్ల బిజినెస్ తెలిసి పోలీసులు విస్తుపోయారు. అచ్చంగా ఆ మధ్య విడుదలై సంచలనం సృష్టించిన బిచ్చగాడు సినిమాని తలపించేలా ఉన్నాయి వాళ్ల స్టోరీలు. ఫర్జానా అనే ఓ బిచ్చగత్తెకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉందట. కానీ ఓ బాబా చెప్పాడని ఇలా బిచ్చగత్తెగా మారిందట. మరో మహిళ రబియాకు ఆస్తులు చాలా ఉన్నా అనుభవించే అదృష్టం లేదు. బిచ్చగత్తెగా మారింది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ బతుకు చిత్రాన్ని బట్టబయలు చేస్తుందీ బెగ్గర్ ఫ్రీ సిటీ ఆపరేషన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com