గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ సహా మంత్రుల ఆకస్మిక పర్యటన

- November 20, 2017 , by Maagulf
గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ సహా మంత్రుల ఆకస్మిక పర్యటన

గ్రేటర్‌లో మంత్రి KTR సహా మరికొందరు మంత్రులు, MLAలు ఆకస్మికంగా పర్యటించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాల్లో తిరిగి, క్షేత్రస్థాయిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బన్సీలాల్ పేటలో మోడ్రన్ మల్టీ లెవల్ ఫంక్షన్ హాల్ పరిశీలించిన నేతలు తర్వాత ముషీరాబాద్, నారాయణగూడలోనూ పలు ప్రాంతాల్లో పర్యటించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించడంతోపాటు, పలు చోట్ల మార్కెట్లలో పరిస్థితి తెలుసుకోనున్నారు. నాలాల్ని కూడా పరిశీలించారు. KTR సహా అందరూ పారిశుద్య కార్మికుల డ్రెస్ కోడ్‌లోనే ఉండడం విశేషం. మంత్రుల నుంచి సామాన్యుల వరకూ అంతా ఒకటేనని చెప్పేందుకే ఇలా డ్రెస్ వేసుకున్నట్టు KTR చెప్పుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com