నిషా కొఠారి యాక్షన్ థ్రిల్లర్ "ఓ రావణ లంక"
- November 21, 2017
నిషా కొఠారి, దేవ్ గిల్ ముఖ్యపాత్రల్లో సంపత్ రాజ్ దర్శకత్వంలో మహంకాళి మూవీస్ పతాకం పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ' ఓ రావణ లంక ' ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఈ సందర్బంగా దర్శకుడు సంపత్ రాజ్ వివరాలు తెలియచేస్తూ .. చాలా రోజుల తరువాత పూర్తీ యాక్షన్ లేడి ఓరియెంటెడ్ సినిమా చేశాను. యాక్షన్ అంశాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా దేవ్ గిల్, నిషా కోటరీల మధ్య క్లైమాక్స్ లో జరిగే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమాలో నిషా కొఠారి నటన అందరిని ఆకట్టుకుంటుంది. కామెడీ తో పాటు థ్రిల్లింగ్ కలిగించే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అన్నారు.
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ .. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసి జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాను మొదలు పెట్టాం. ఈ సినిమాలో సంగీతం కూడా హైలెట్ గా నిలుస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కే ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంది అన్నారు.
రాఘవ, సందీప్తి , దినేష్, గౌతమ్, బాలు అమృత తదితరులునటిసున్న ఈ చిత్రానికి కెమెరా : వల్లి , ఎడిటింగ్ : హరీష్ కృష్ణ , సంగీతం : శీఘ , కో డైరెక్టర్ : నవీన్ చామికురి , నిర్మాత మహంకాళి దివాకర్ , కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - సంపత్ రాజ్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష