స్కూల్ టీచర్లకు సర్కారు ఊహించని డ్యూటీ!
- November 21, 2017
పాట్న: బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం స్కూల్ టీచర్లకు ఓ విచిత్రమైన డ్యూటీ వేసింది. బహిరంగ విసర్జనకు వెళ్లేవారిని ఓ కంట కనిపెట్టాలని ఆదేశించింది. మరుగుదొడ్లు వినియోగించకుండా బహిరంగంగా పనికానిచ్చే వారిని ఫోటోలు తీయాలని హుకుం జారీచేసింది. ఈ మేరకు అన్ని బ్లాకుల్లోని విద్యాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం టీచర్లు రెండు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఎవరెవరు చెంబు పట్టుకుని వెళ్తున్నారో కాపలా కాయాల్సిఉంటుంది. అధ్యాపకులు ఈ డ్యూటీలు సరిగ్గా చేస్తున్నారో లేదో పర్యవేక్షించే బాధ్యతలను స్కూల్ ప్రిన్సిపల్స్‌కు అప్పగించారు.
వృత్తికి సంబంధంలేని డ్యూటీలు చేయాలంటూ బీహార్ ప్రభుత్వం అక్కడి టీచర్లను ఆదేశించడం ఇదేం కొత్తకాదు. గతంలో జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల డ్యూటీలు, ఓటర్ల జాబితా సరిచూడడం సహా పలు కార్యక్రమాల్లో ఉపాధ్యాయులే విధులు నిర్వహించాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







