చెన్నై: సత్యభామ కళాశాల లో తెలుగు యువతి ఆత్మహత్య
- November 22, 2017
చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా మౌనిక కాపీ కొట్టిందని.. దీంతో ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది. మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మౌనిక మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మౌనిక ఆత్మహత్య విషయం తెలియగానే... తోటి విద్యార్థులు చెన్నై సత్యభామ వర్శిటీలో విధ్వంసం సృష్టించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్ధులు విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్ గదులలోని ఫర్నిచర్‌తో పాటు బస్సులు, ఇతర వాహనాలకు విద్యార్థులు నిప్పుపెట్టారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విధ్వంసం గురించి సమాచారం అందగానే పోలీసులు పెద్ద ఎత్తున క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితి కంట్రోల్ చేశారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







