'ఓటర్' ఫస్ట్ లుక్ విడుదల...
- November 23, 2017
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈయన వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా పెద్దగా విజయాలు మాత్రం సాధించలేక పోతున్నారు మంచు అబ్బాయిలు. ఇక మంచు విష్ణు ఆ మద్య వచ్చిన 'ఢీ' సూపర్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ హిట్ సినిమాలు మనోడు ఇప్పటి వరకు చూడలేదని చెప్పొచ్చు.
తాజాగా మంచు విష్ణు.. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఆచారి అమెరికా యాత్ర అనే సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో 'ఓటర్' అనే సినిమా చేయనున్నాడు. ఇందులో సురభి కథానాయికగా నటించనుంది. అయితే ఈ రోజు మంచు విష్ణు బర్త్డే సందర్భంగా యూనిట్ ఓటర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.
పోస్టర్ చూస్తుంటే..సినిమా చాలా ఎమోషనల్, పాలిటిక్స్ పై తిరగబడే చిత్రంగా కనిపిస్తుంది. ఓటర్గా చేతికి నల్ల ఇంకు పెట్టుకొని సీరియస్ లుక్ లో మంచు విష్ణు కనిపిస్తుండగా, ఆయన బ్యాక్ గ్రౌండ్లో పలువురు రాజకీయ నాయకుల ఫోటోలు కనిపిస్తున్నాయి. ఓటర్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష