చరణ్‌ 12వ చిత్రం మొదలైంది

- November 24, 2017 , by Maagulf
చరణ్‌ 12వ చిత్రం మొదలైంది

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం శుక్రవారం కొణిదెల ప్రొడక్షన్‌ కార్యాలయంలో నిర్వహించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మించనున్నారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది. 
ప్రస్తుతం రామ్‌చరణ్‌ రంగస్థలం చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా సమంత నటిస్తున్నారు. 2018 మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క రామ్‌చరణ్‌.. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌ చిత్రంలోనూ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com