నేడు హైదరాబాద్ లో సన్‌బర్న్ పార్టీ
- November 24, 2017
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం సన్‌బర్న్ పార్టీ జరగనుంది. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పార్టీకి పోలీసులు అనుమతినిచ్చారు. కాగా... ఈ పార్టీలో పాల్గొనేందుకు రూ. 7500 నుంచి లక్ష రూపాయల వరకూ టికెట్ల ధరలు నిర్ణయించారు. అయినప్పటికీ హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కాగా... 100 పబ్‌లు ఒకచోట చేరితే వచ్చే శబ్ధం ఒక సన్‌బర్న్ పార్టీకి సమానమని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ సన్‌బర్న్ పార్టీకి అనుమతినివ్వడంపై పలు విమర్శలొస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ... పార్టీలకు అనుమతినిస్తున్న ప్రభుత్వం కొలువుల కొట్లాట సభకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ప్రశ్నిస్తున్నాయి. అలాగే సన్‌బర్న్ పార్టీ నిర్వహణ వల్ల స్టేడియంలోని గ్రౌండ్ పాడవుతుందని అథ్లెట్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే రోజూ జాతీయ క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే గ్రౌండ్‌ను సన్‌బర్న్‌పార్టీకి అనుమతివ్వటం సరికాదని వాకర్స్ పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష