2 కంట్రీస్ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్
- November 24, 2017
సునీల్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2 కంట్రీస్ టీజర్‌ను నా చేతుల మీదుగా లాంచ్ చేయటం ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజర్‌లాగానే సినిమా ఉంటుందని ఆశిస్తూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. నేను ఆదరించినట్టే ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను..జై హింద్.. అని పవన్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అన్నారు. సునీల్, మనీషా రాజ్ జంటగా స్వీయ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ నిర్మిస్తున్న చిత్రం 2 కంట్రీస్. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కథానాయకుడు సునీల్ మాట్లాడుతూ, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మా చిత్ర టీజర్‌ను లాంచ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. మా టీజర్‌ను లాంచ్ చేయటమే కాకుండా ఎంతో బాగుందని ప్రశంసించిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పారు. దర్శక,నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ, షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మేం అడగ్గానే మా చిత్ర టీజర్‌ను లాంచ్ చేసిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిజీ టైమ్‌లో కూడా విలువైన సమయాన్ని మాకు కేటాయించి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మరోసారి తన సహృదయతను చాటుకున్నారు. మా టీజర్‌ను ఆయన లాంచ్ చేయటం సంతోషాన్నిస్తే, ఆ టీజర్ ఎంతో బాగుందని అప్రిషియేట్ చేయటం మరింత ఆనందాన్నిచ్చింది. అన్ని కార్య్రకమాలను పూర్తి చేసి డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం అని అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష