సాల్మియాలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
- November 24, 2017
కువైట్ : ' రావోయి మా ఇంటికి ...ఓ మావ మాట ఉన్నది ..ఓ మంచి మాటు ఉన్నది ' అంటూ బుట్టలో పడిన విటులకు తాము అందచేసే వివిధ సేవలను సామాజిక మాధ్యమాల ద్వారా విపులంగా ఆ నెరజాణులు వివరిస్తారు. సాల్మియా ప్రాంతంలో ఈ తరహా వ్యభిచారం రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ముఠాను రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధకులు వలపన్ని పట్టుకొన్నారు. ఈ సభ్యులు సాల్మియా లో ఒక అపార్ట్మెంట్ తీసుకొని సోషల్ మీడియాలో ఒక డెమో కార్యక్రమం ద్వారా అసభ్య చిత్రాలు..వీడియోలు పోస్ట్ చేయడం గమనించిన అపరాధ పరిశోధకులు వీరిని అదుపులోనికి తీసుకొన్నారు. రెసిడెన్సీ చట్టం ఉల్లంఘించడమే కాక వ్యభిచారం నేరంలో నిందితులుగా ఉన్నారు. 12 మంది ఆసియా మరియు ఆఫ్రికన్ మహిళలను అరెస్టు చేశారు. వారు తమపై నమోదైన ఆరోపణలను ఒప్పుకున్నారు. దాంతో సంబంధిత న్యాయాధికారులకు వద్దకు పంపబడ్డారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







