సాల్మియాలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

- November 24, 2017 , by Maagulf
సాల్మియాలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

కువైట్ : ' రావోయి మా ఇంటికి ...ఓ మావ మాట ఉన్నది ..ఓ మంచి మాటు ఉన్నది ' అంటూ బుట్టలో పడిన విటులకు తాము అందచేసే వివిధ సేవలను సామాజిక మాధ్యమాల ద్వారా విపులంగా ఆ నెరజాణులు వివరిస్తారు.  సాల్మియా ప్రాంతంలో ఈ తరహా వ్యభిచారం రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ముఠాను రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధకులు వలపన్ని పట్టుకొన్నారు. ఈ  సభ్యులు సాల్మియా లో ఒక అపార్ట్మెంట్ తీసుకొని  సోషల్ మీడియాలో ఒక డెమో కార్యక్రమం ద్వారా అసభ్య చిత్రాలు..వీడియోలు పోస్ట్ చేయడం గమనించిన అపరాధ పరిశోధకులు వీరిని అదుపులోనికి తీసుకొన్నారు.  రెసిడెన్సీ చట్టం ఉల్లంఘించడమే కాక వ్యభిచారం నేరంలో నిందితులుగా ఉన్నారు. 12 మంది ఆసియా మరియు ఆఫ్రికన్ మహిళలను అరెస్టు చేశారు. వారు తమపై నమోదైన ఆరోపణలను ఒప్పుకున్నారు. దాంతో సంబంధిత న్యాయాధికారులకు వద్దకు పంపబడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com