చెక్ బౌన్స్ కేసులో.. బండ్ల గణేష్ కు జైలు శిక్ష..!

- November 24, 2017 , by Maagulf
చెక్ బౌన్స్ కేసులో.. బండ్ల గణేష్ కు జైలు శిక్ష..!

తెలుగు ఇండస్ట్రీలో చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు బండ్ల గణేష్. ఆ మద్య పవన్ కళ్యాన్ తో తెరకెక్కించిన 'గబ్బర్ సింగ్ ' సినిమాతో మనోడికి ఎక్కడ లేని పాపులారిటీ వచ్చింది. తాజాగా బండ్ల గణేష్ గణేష్ కు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆరు నెలల జైలు శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా విధించింది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాకు వక్కంతం వంశీ రచయితగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, తనకు నిర్మాత బండ్ల గణేష్ చెల్లని చెక్ ఇచ్చారంటూ వక్కంతం వంశీ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది.
తీర్పు అనంతరం, బండ్ల గణేష్ బెయిల్ కు దరఖాస్తు పెట్టుకోగా... జడ్జి బెయిల్ మంజూరు చేశారు. గతంలో సచిన్ జోషి లాంటి మరికొందరు కూడా బండ్ల గణేష్ మీద కోర్టుకెక్కారు. ఇప్పుడు వక్కంతం వంశీ కేసులో పడ్డ శిక్షను అయన లీగల్ గా ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com