ప్రభుత్వ కార్యాలయాల్లో జిమ్‌లు ఏర్పాటు: చంద్రబాబు
- November 24, 2017
విజయవాడ: నగరంలో ఆర్‌అండ్‌బీ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.101 కోట్లతో 12 నెలల్లో పర్యావరణహితంగా భవన నిర్మాణం చేపట్టారని, భవనంపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా 30 శాతం విద్యుత్ ఆదా కానుందని సీఎం అన్నారు. భవనంలో ఏపీపీఎస్సీ, ఐటీ, ఆర్‌అండ్‌బీ శాఖలు పనిచేయనున్నాయన్నారు.
రహదారులు బాగుంటే అభివృద్ధి అదే జరుగుతుందని ఆయన చెప్పారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై ఆలోచిస్తున్నామని, జిల్లాల్లో అన్ని శాఖలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తిస్థాయి రావాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో జిమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించబోమని సీఎం వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష