మణిరత్నంతో 14వ సారి పనిచేస్తున్నఏఆర్
- November 24, 2017
ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకి అందించిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం. వచ్చే ఏడాది జనవరిలో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నాడు మణిరత్నం. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు కూడా కీలక పాత్రలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడని టీం సభ్యుల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే గోవాలో వీరిద్దరు కలిసి సాంగ్స్ కంపోజింగ్ మొదలు పెట్టారట. మణిరత్నంతో పనిచేయడం ఇది ఏఆర్ రెహమాన్‌కి 14వ సారి అని తెలుస్తుంది.
మణిరత్నం- అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన రోజా, దళపతి, బొంబాయి మరియు కాదల్ వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ లతో పనిచేయడం మణిరత్నంకిదే తొలిసారి. సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నాడు. భర్త మరణం తర్వాత తొలి సారి సహజ నటి జయసుధ ఈ చిత్రంలో నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని కూడా మణిరత్నం మల్టీ స్టారర్ లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







