కలిసి సహజీవనం చేసి పెళ్లి చేసుకోమని అడిగితే కాదు పొమ్మన్న టీవీ నటుడు పియూష్

- November 25, 2017 , by Maagulf
కలిసి సహజీవనం చేసి పెళ్లి చేసుకోమని అడిగితే కాదు పొమ్మన్న టీవీ నటుడు పియూష్

ప్రముఖ టీవీ నటుడు పియూష్ సహదేవ్ (35) రేప్ కేసులో అరెస్టయ్యాడు. ఇటీవల భార్యకు విడాకులిచ్చి వార్తల్లో నిలిచిన పియూష్ ఇప్పుడు మరోసారి వార్తలకెక్కాడు. ఓ ఫ్యాషన్‌షోలో పరిచయమైన ఫ్యాషన్ డిజైనర్‌తో స్నేహం చేసాడు. గత మూడు నెలలుగా ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడామె పియూష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ అతడిపై కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు పియూష్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

కాగా పియూష్.. బేహద్ దేవోంకే దేవ్ మహదేవ్, హర్ ఘర్ కుచ్ కెహతా హై, సప్నే సుహానే లడక్ పన్ కే, బేహాద్, మీట్ మిలాదే రబ్బా, ఘర్ ఏక్ సప్నా, గీత్, మన్ కే అవాజ్, హమ్ నే లీ హై శపథ్ లాంటి హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com