పారిస్‌ వీధుల్లో పులి హల్‌చల్‌

- November 25, 2017 , by Maagulf
పారిస్‌ వీధుల్లో పులి హల్‌చల్‌

సర్కస్‌ నుంచి తప్పించుకుని నగర వీధుల్లోకి ప్రవేశించిన ఓ పెద్దపులిని యజమాని కాల్చివేశాడు. ఈ ఘటన శనివారం పారిస్‌లో చోటు చేసుకుంది. బొర్మాన్‌ - మోరెనో సర్కస్‌ రోడ్డు మీదకు పులి రావడంతో షాక్‌కు గురైన ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ ప్రజలు భయంతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక​ నిలిచిపోయింది. దీంతో అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగాల్సివచ్చింది. 

అంతేకాకుండా పులి తిరుగుతున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించాల్సి వచ్చింది. అంతలో అక్కడికి చేరుకున్న పులి యజమాని దాన్నిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పులి తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. పులి యజమానిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. అదృష్టవశాత్తు పులి ఎవరినీ గాయపర్చలేదని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com