ప్రతి ఇమామ్‌కు నెలకు రూ.10వేలు వేతనం ఇస్తాం
- November 25, 2017
వైసీపీ అధికారంలోకి వచ్చాక మసీదులో ప్రతి ఇమామ్‌కు నెలకు రూ.10వేలు వేతనం ఇస్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. పుట్లూరు సమీపంలో జగన్ ముస్లింల ఆత్మీయ సదస్సుకు హాజరయ్యారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని, జగన్ సీఎం కావాలని ముస్లిం మత పద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ పాలనను కొనసాగించాలని ఈ సందర్భంగా జగన్‌కు ముస్లింలు విజ్ఞప్తి చేశారు. ముస్లింల ఆత్మీయ సదస్సులో జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదు, చర్చి, దేవాలయాలకు రూ.15వేలు నిర్వహణ ఖర్చులు ఇస్తామన్నారు. వైఎస్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. 8 శాతం రిజర్వేషన్లంటూ ముస్లింలను చంద్రబాబు నిలువునా ముంచారన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష