హైదరాబాద్ లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ విద్యార్థులు
- November 25, 2017
మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది. ముగ్గురు విద్యార్థులు డ్రగ్స్‌తో పట్టుబడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగర్లో జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థి అరవింద్, ఐటీఐ విద్యార్థులు శ్రవణ్, హేమంత్ల వద్ద డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వారి వద్ద నుంచి అరకేజీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని.. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







