ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మందికి యూఏఈ సిటిజన్షిప్
- November 25, 2017
ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్షిప్ని మంజూరు చేశారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, ఏర్పాటయిన కమిటీ, పౌరసత్వం కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, 309 మందికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ డిప్యటీ మినిస్టర్ అహ్మద్ జుమా అల్ జాబి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, 46వ నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా పౌరసత్వం పొందిన పౌరులు యూఏఈ చట్టాల పట్ల, నియమ నిబంధనల పట్ల అవగాహనతో ఉండాలనీ, యూఏఈ అభివృద్ధిలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







