బహ్రెయిన్‌లో ఇండియన్ డాన్స్ సెలబ్రేషన్
- November 25, 2017
మనామా: బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ, క్లాసికల్ డాన్స్ పెర్ఫామెన్స్‌ని బహ్రెయిన్ కల్చరల్ హాల్‌లో శనివారం సాయంత్రం 6.30 నిమిషాలకు నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌ని భారత ప్రభుత్వం - మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాగే బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ సహకారంతో నిర్వహించబడ్తోంది. సంజీవ్ కుమార్ అగ్నిహోత్రి నేతృత్వంలోని టీమ్ కథక్ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. శివ వందన సహా పలు ఆకర్షణలు ఇందులో ఉంటాయి. కథక్, ఫోక్ స్టయిల్‌లో సంప్రదాయ హోలీ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. సంజీవ్ కుమార్ అగ్నిహోత్రి, థియేటర్ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ని భార్తేందు అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్స్‌లో పొందారు. దీపా శశిధరన్ నేతృత్వంలో కూచిపూడి డాన్స్ కూడా ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. కూచిపూడిలో అపార ప్రావీణ్యం ఉన్న మంజు భార్గవి వద్ద దీపా నారాయణన్ శశిధరన్ సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







