నడి రోడ్డుపై నాట్యం చేసిన మహిళ ... మండిపడుతున్న మతపెద్దలు

- November 25, 2017 , by Maagulf
నడి రోడ్డుపై నాట్యం చేసిన మహిళ ... మండిపడుతున్న మతపెద్దలు

కువైట్: " నేనాడితే ...లోకమే ఆడదా "  అంటూ ఓ మహిళకు ఎందుకో  కొంచెం హుషారు ఎక్కువై కువైట్ లోని ఒక  నడి రోడ్డుపై నాట్యం చేసింది. అయితే ,  లోకమైతే.. ఆమెతో ఆడలేదుగాని ఆమె డ్యాన్స్ చేస్తుండగా ఎవరో  వీడియో  తీశారు. అంతటితో ఆగక ఆ వీడియోబాబు ఆమె డ్యాన్స్ చేసిన వీడియో క్లిప్పును ఎంచక్కా సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ఆ పోస్ట్ స్థానికంగా పెద్ద దుమరాన్నే రేపింది. అయితే ఆమె కావాలనే ఆ వీడియోను సోషల్ మీడియాలో తనంతట తానే  పోస్టు చేసిందని మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ నడిరోడ్డుపై సిగ్గులేకుండా ఒంటరిగా డ్యాన్స్ చేయడం ఏమిటని ఇది  ఇస్లాం ఆచారాలకు విరుద్ధమని ఆగ్రహిస్తున్నారు. ఆ వీడియోను చూసి మరికొంతమంది  మహిళలు ప్రభావితమై  అదేవిధంగా  డాన్స్ చేసే ప్రమాదముందని  మండిపడుతున్నారు.. పోలీసులు కూడా ఆమెపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇస్లాం ఆచారాలను ఆమె దెబ్బతీసిందని అంటున్నారు. అంతేకాకుండా ప్రజల మనోభావాలను కూడా ఆమె కించపరించిందని వారంటున్నారు. ఆ మహిళను పెట్టుకొనేందుకు పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వెనుక భాగం మాత్రమే చూపిస్తూ..నాట్యం చేయడంతో ఆమె ఎవరనేది పోలీసులు సరిపోల్చుకోలేక నానా యాతనలు చెందుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com