'సైరా' సినిమా చేయలేకపోతున్నాను: రెహమాన్

- November 25, 2017 , by Maagulf
'సైరా' సినిమా చేయలేకపోతున్నాను: రెహమాన్

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కబోయే సైరా నరసింహ రెడ్డి సినిమా చేయబోతున్న సంగతి తెల్సిందే..తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు తెరకెక్కించని విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికి తగట్టే సినిమా లోని కాస్ట్ అండ్ క్రూ ను భారీగా ఎంపిక చేసాడు. అయితే ఈ మూవీ నుండి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్నట్లు తెలిపాడు.
ఒక కచేరీ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిగారు నా అభిమాన హీరో. ఆయన సినిమాకు పనిచేయాలని ఎన్నాళ్లగానో ఎదురుచూస్తూవస్తున్న.. కానీ బిజీ షెడ్యూల్ వలన 'సైరా' సినిమా చేయలేకపోతున్నాను. అంత మంచి ప్రాజెక్ట్ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను అని అన్నారు. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ఈ మూవీ నుండి తప్పుకున్న సంగతి తెల్సిందే..ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ కూడా తప్పుకోవడం ఫై అభిమానులు కలవర పడుతున్నారు. మరి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను ఎవర్ని తీసుకుంటారో చూడాలి. ఇక 'సైరా' నటి నటుల విషయానికి వస్తే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం మరో విశేషం.

నయనతార, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com