మెట్రో బాధ్యతలు...మహిళకే ప్రాధాన్యత

- November 26, 2017 , by Maagulf
మెట్రో బాధ్యతలు...మహిళకే ప్రాధాన్యత

హైదరాబాద్: మెట్రో రైలు కల మరో మూడు రోజుల్లో నెరవేరబోతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ మెట్రో రైళ్లని నడిపే బాధ్యతల్ని... ఎక్కువగా మహిళలకే ఇవ్వబోతున్నారు. అంతేకాదు... ఈ ప్రాజెక్టులోని చాలా విభాగాల్లోనూ మహిళలే కీలక పాత్ర పోషించబోతున్నారు. హైదరాబాద్ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెట్రో రైలు... మరో మూడు రోజుల్లో పరుగులు తీయబోతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే మెట్రో రైలు... మియాపూర్-నాగోల్ స్టేషన్ల మధ్య.. ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు నడుస్తుంది. ప్రజల నుంచి వచ్చే ఆదరణను బట్టి.. సమయాన్ని పొడిగించే అంశాన్నీ పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్ కే తలమానికంగా మారబోతున్న ఈ మెట్రో రైలును నడిపే బాధ్యతల్ని... ఎక్కువగా మహిళా డ్రైవర్లకే ఇవ్వబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్ పాట్నర్ షిప్ ప్రాజెక్ట్ అయిన హైదరాబాద్ మెట్రోలో... 35 మంది మహిళా లోకో పైలెట్లు రైలును నడపబోతున్నారు. ఇప్పటిదాకా 100 మంది మహిళా లోకో పైలెట్లకు శిక్షణ ఇవ్వగా వారిలో 35 మంది ఇప్పటికే రైలు ట్రయల్ రన్‌లో భాగమయ్యారు. ఏడాదిన్నర కాలంగా మహిళా లోకోపైలెట్లు అందరూ... ట్రయల్ రన్ లో భాగంగా మెట్రో రైలును నడుపుతున్నారు. వీరిలో చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

తమను తాము నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశం దొరికిందని... ప్రాజెక్టులో తాము కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని.. మహిళా లోకో పైలెట్లు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com