సెల్ఫీలు ఇక్కడ తీయరాదు....

- November 26, 2017 , by Maagulf
సెల్ఫీలు ఇక్కడ తీయరాదు....

రియాద్: మక్కాలోని ‘ది గ్రేట్ మాస్క్ ఆఫ్ మక్కా’, మదీనాలోని మజీద్ అల్ హరం( ది ప్రొఫెట్స్ మాస్క్) పవిత్రమైన ఈ రెండు ప్రదేశాలలో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకోవడాన్ని నిషేధించింది. భక్తితో వచ్చిన వారికి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నవారు ఇబ్బంది కలిగిస్తున్నారని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. వెంటనే ఆదేశాలు అమలులోకి వస్తాయని తెలిపారు. అనేక మంది తమ సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలను ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. భక్తి లేకుండా ఈ చర్యలకు పాల్పడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com