వెంకీ లుక్ అదుర్స్..ఇంతకీ ఏం ప్రాజెక్ట్?

- November 26, 2017 , by Maagulf

'గురు' తర్వాత ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు విక్టరీ వెంకటేష్. తమ అభిమాన హీరో కొత్త ప్రాజెక్ట్‌తో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాడాని వెయిట్ చేస్తున్నారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్. తేజ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడని, బర్త్‌డే రోజు పూజా కార్యక్రమాలు మొదలై సమ్మర్‌కి రిలీజ్ కావచ్చని అంటున్నారు.
ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. వెంకటేష్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. వాటిని చూసిన చాలామంది.. ప్రాజెక్ట్ ఏంటి? డైరెక్టర్ ఎవరు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ అసలు మేటరేంటంటే.. వెంకీ ఓ యాడ్ చేస్తున్నాడు.. అందులోవి ఈ పిక్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com