రెహ్మాన్‌ గానానికి పరవశించిన భాగ్యనగరం

- November 26, 2017 , by Maagulf
రెహ్మాన్‌ గానానికి పరవశించిన భాగ్యనగరం

రాయదుర్గం: 'జయహో.. జయహో..' 'వూర్వశీ.. వూర్వశీ..' 'ముస్తఫా.. ముస్తఫా' వంటి పాటల ఝరిలో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. 'హైదరాబాద్ టాకీస్' ఆధ్వర్యంలో 'ఎంకోర్‌' అనే పేరుతో ఆదివారం రాత్రి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత కచేరి ఉల్లాసంగా సాగింది. ఆయన పాటలతో యువత సంగీత డోలికల్లో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వర్ధమాన సినీగాయకులుగా ప్రేక్షలుగా హాజరై ఆయన పాటలను ఆస్వాదించారు. ఆఖరులో ప్రేక్షకులంతా సెల్‌ఫోన్‌ లైట్లు వేసి స్ఫూర్తి అందించాలని రెహ్మాన్‌ కోరడంతో స్టేడియం సెల్‌ఫోన్‌లైట్లతో వెలిగి పోయింది. కార్యక్రమానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, సినీనటులు అల్లరి నరేష్‌, సాయిధరమ్‌ తేజ్‌, రాశిఖన్నా తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com