డిసెంబర్ 6న ఢిల్లీలో ప్రవాసీల కోసం ప్రజావాణి

- November 26, 2017 , by Maagulf
డిసెంబర్ 6న ఢిల్లీలో ప్రవాసీల కోసం ప్రజావాణి

ఢిల్లీ: 18 ఇసిఆర్ దేశాలకు ఉద్యోగానికి వలస వెల్లదలచినవారు, ఆయాదేశాల నుండి వాపస్ వచ్చినవారి సమస్యలను వినడానికి ప్రతినెల మొదటి బుధవారం డిల్లీలోని విదేశాంగ శాఖ, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పిజిఇ) కార్యాలయంలో 'ఓపెన్ హౌజ్' (బహిరంగ వేదిక) ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 6న బుధవారం ఢిల్లీ లోని చాణక్యపురి, అక్బర్ భవన్ లో గల పిజిఇ కార్యాలయంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు  'ఓపెన్ హౌజ్' కార్యక్రమం 'ప్రవాసి ప్రజావాణి' ని నిర్వహిస్తారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు పిజిఇ కార్యాలయం ఫోన్ నెం. 011 2467 3965 ఈ-మెయిల్: [email protected] కు సంప్రదించవచ్చు. సలహాలు, సహాయం కోసం తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ప్ లైన్ నెంబర్ 81435 88886 కు కాల్ చేయవచ్చు. గల్ఫ్ వలసకార్మికులు చాలాదూరంలో ఉన్న ఢిల్లీకి వెళ్లడం కష్టమని, దేశంలోని 10 ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) కార్యాలయాలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కొలకత్తా, చెన్నయి,చండీఘర్, కొచ్చిన్, త్రివేండ్రం, జైపూర్, రాయ్ బరేలి లలో 'ఓపెన్ హౌజ్' కార్యక్రమాలు నెలకు రెండుసార్లు నిర్వహించాలని ప్రవాసీలు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com