రాజకీయాల్లోకి పునః ప్రవేశం చేయనున్న జయప్రద

- November 26, 2017 , by Maagulf
రాజకీయాల్లోకి పునః ప్రవేశం చేయనున్న జయప్రద

అమలాపురం: సినీ నటి జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో ఆ పార్టీకి జయప్రద దూరంగా ఉంటున్నారు. దీంతో తన స్వంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పునః ప్రవేశం చేయాలని జయప్రద ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినీ నటి జయప్రద 1995-96 కాలంలో టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. టిడిపి తరపున ఆమె ఎంపీగా పనిచేశారు. చాలా కాలం పాటు టిడిపిలో కొనసాగారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టిడిపికి దూరమైన జయప్రద సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.సమాజ్‌వాదీ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు.అయితే కొంత కాలం క్రితం సమాజ్‌వాద్‌ పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో జయప్రద ఆ పార్టీకి దూరమయ్యారు.

1) ఏపీ రాజకీయాలపై జయప్రద దృష్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జయప్రద దృష్టి కేంద్రీకరించారు. త్వరలోనే ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించిే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా ప్రకటించారు. అయితే ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరనున్నారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జయప్రదపై రెండు ప్రధాన పార్టీలు కేంద్రీకరించాయనే ప్రచారం కూడ లేకపోలేదు.

2) బాబుపై జయప్రద ప్రశంసలు
అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి జయప్రద అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. అయితే, విభజన హామీల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మరింత సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జయప్రద చంద్రబాబునాయుడుపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు చూస్తే ఆమె తిరిగి టిడిపిలో చేచేందుకు రంగం సిద్దం చేసుకొంటుందా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఏ పార్టీలో చేరేది మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు.

3) రాజకీయ లక్ష్యం ఉంది
తనకు ఓ రాజకీయ లక్ష్యం ఉందని సినీ నటి జయప్రద ప్రకటించారు. అయితే ప్రస్తుతానికైతే తన మనసులోని మాటను బయటపెట్టబోనని తెలిపారు. ఏ పార్టీలో చేరబోతున్నానన్న సంగతిని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే జయప్రద వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే వైసీపీ నేతలు జయప్రదతో సంప్రదింపులు జరిపారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయాలపై జయప్రద త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారని ఆమె సన్నిహితులంటున్నారు.

4) త్వరలోనే రాజకీయ ప్రవేశంపై ప్రకటన
ఏపీ రాజకీయాల్లో సినీ నటి జయప్రద తిరిగి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఈ ఎన్నికల లోపుగా ఆమె ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉంది. రాజకీయ రంగ ప్రవేశం గురించి త్వరలోనే ప్రకటించనున్నట్టు జయప్రద తేల్చి చెప్పేశారు. ఈ పరిణాలను పరిశీలిస్తే జయప్రద రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేందుకు సన్నాహలు చేసుకొంటున్నారంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com