భారతీ ఎయిర్‌టెల్ రూ.5,000 కోట్ల స్టెర్లింగ్ బాండ్‌లను జారీ చేయనున్నది
- November 13, 2015
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ.5,000 కోట్ల(50 కోట్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్) స్టెర్లింగ్ బాండ్‌లను జారీ చేయనున్నది. ఈ బాండ్లను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేస్తామని ఎయిర్‌టెల్ గ్రూప్ కోశాధికారి హర్జిత్ కోహ్లి చెప్పారు. ఈ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తంతో ప్రస్తుతమున్న రుణాలను రీ ఫైనాన్స్ చేస్తామని చెప్పారు. అంతర్జాతీయంగా రుణ పరిస్థితులు, మార్కెట్ల స్థితిగతులు వంటి అంశాలతో పాటు వివిధ సంస్థల నుంచి అనుమతులు రావల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ బాండ్లు ఎప్పుడు జారీ చేసేదీ వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటికే డాలర్లు, యూరోలు, క్రోనార్ కరెన్సీల్లో బాండ్లను జారీ చేశామని, ఈ బాండ్‌లను సింగపూర్, ఫ్రాంక్‌ఫర్ట్, స్విట్జర్లాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్ చేశామని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







