షార్జాలో బస్‌ ఛార్జీల పెంపు

- November 28, 2017 , by Maagulf
షార్జాలో బస్‌ ఛార్జీల పెంపు

డిసెంబర్‌ 1 నుంచి షార్జా సిటీ బస్‌ ట్రిప్స్‌కోసం వినియోగదారులు అదనంగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. షార్జా రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అన్ని సిటీ రూట్స్‌లోనూ, బస్‌ ఛార్జీలు పెరగబోతున్నట్లు ఆర్‌టిఎ వెల్లడించింది. 6 దిర్హామ్‌ల ఛార్జీకి బదులుగా ఇకపై 7 దిర్హామ్‌లను చెల్లించాల్సి ఉంటుంది. సాయెర్‌ కార్డులు కలవారు 4.5 దిర్హామ్‌లకు బదులుగా 5.5 దిర్హామ్‌లు చెల్లించాలి. నిర్వహణా వ్యయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా ఆర్‌టిఎ వర్గాలు వెల్లడించాయి. ప్రతిరోజూ సిటీ బస్సుల్ని వినియోగిస్తుంటామని, ఈ ఛార్జీల పెంపు తమకు భారంగా మారనుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com