యూఏఈ నేషనల్‌ డే: ఉల్లంఘనకు 2,000 దిర్హామ్‌ల జరీమానా

- November 28, 2017 , by Maagulf
యూఏఈ నేషనల్‌ డే: ఉల్లంఘనకు 2,000 దిర్హామ్‌ల జరీమానా

యూఏఈ: యూఏఈ నేషనల్‌ డే సందర్భంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే 2,000 దిర్హామ్‌ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రముఖ స్ట్రీట్స్‌లో ప్రత్యేక పెట్రోల్‌ వాహనాల్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బుర్‌ దుబాయ్‌, జుమైరా స్ట్రీట్‌, అల్‌ సుఫోహ్‌ స్ట్రీట్‌, జిబిఆర్‌ వంటి ప్రాంతాల్లో పెట్రోల్‌ వాహనాలు మోహరిస్తున్నారు. డేడ్రా, అల్‌ మురాక్కాబాత్‌, అల్‌ రక్కా, అల్‌ మంజార్‌, రషిదియా, అల్‌ ఖలీజ్‌ స్ట్రీట్‌, అల్‌ ఇత్తిహాద్‌ స్ట్రీట్‌, అమ్మాన్‌ స్ట్రీట్‌, యూనివర్సిటీ సిటీ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగేలా వాహనాల్ని నడపడాన్ని సీరియస్‌గా పరిగణిస్తామని అధికారులు చెప్పారు. రోడ్లపైన వాహనాల్ని నిలిపివేయడం, వాహనాలతో శబ్ద కాలుష్యం అతిగా చేయడం వంటివాటికి కఠిన చర్యలుంటాయి. 6 నుంచి 23 బ్లాక్‌ పాయింట్స్‌ వరకూ ఆయా నేరాలకు వర్తిస్తాయి. అలాగే జరీమానాలు 1,000 దిర్హామ్‌ నుంచి 2,000 దిర్హామ్‌ వరకు జరీమానా తప్పదు. వాహనాల జప్తు 60 రోజుల వరకు ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com