వాట్సాప్‌లో కొత్త ఫీచర్
- November 28, 2017
వాషింగ్టన్: వాట్సాప్ తమ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సందేశాల్లో భాగంగా పంపే యూట్యూబ్ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌ను వీడాల్సిన అవసరం లేదు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్ వినియోగదారుల కోసం ఈ సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. చాట్‌లో భాగంగా ఏదైనా యూట్యూబ్ వీడియో లింక్‌ను పంపిస్తే ఇక ఆ వీడియోను వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. ఆ వీడియోను చూస్తూ చాట్‌ను కొనసాగించవచ్చు. ఇతర చాట్‌లోకి కూడా వెళ్లవచ్చు. గతంలో ఎవరైనా పంపిన యూట్యూబ్ వీడియో లింక్‌ను క్లిక్ చేస్తే అది యూట్యూబ్ యాప్‌లోకి వెళ్లి ప్లే అయ్యేది. దీంతో వాట్సాప్ నుంచి యూజర్ యూట్యూబ్‌కు వెళ్లాల్సివచ్చేది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేరుగా సంభాషణల మధ్యలోనే వీడియోను చూసుకునే సదుపాయం లభించనుంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







