కెన్యా అధ్యక్షుడిగా కెన్యట్టా

- November 28, 2017 , by Maagulf
కెన్యా అధ్యక్షుడిగా కెన్యట్టా

నైరోబీ : కెన్యా అధ్యక్షుడిగా ఉహురూ కెన్యట్టా రెండోసారి ప్రమాణం చేశారు. మరో ఐదేండ్ల పాటు ఆయన దేశాధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించనున్నారు. నైరోబీలోని కసరానీ స్టేడియంలో జరిగిన ప్రమాణో త్సవ కార్యక్రమానికి 13 దేశాలకు చెందిన అధ్యక్షు లు, ప్రతినిధులు, ప్రధాన మంత్రులు, విదేశాంగ మంత్రులు, దౌత్యవేత్తలు, కార్యకర్తలు, వేలాది మంది తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం కెన్యట్టా ప్రసంగించారు. దేశాభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. దేశ సేవకే తాను పునరంకితమని ఉద్ఘాటిం చారు. దేశ ప్రజల్లో ఐకమత్యం పెంపొందిస్తానని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తామన్నారు. 

ఈఎన్నికల్లో సిట్టింగ్‌ ప్రెసిడెంట్‌ కెన్యట్టా తన ప్రత్యర్థి రైలా ఒడింగాపై 54శాతం ఓట్లతో గెలుపొందారు. దీంతో, ఈ ఎన్నికల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ రైలా పేచీ పెట్టారు. తాను ఓటమిని అంగీకరించబోనని ప్రకటించారు. అనేక ఆందోళన కార్యక్రమాలకు ఆజ్యం పోసారు. ఫలితంగా 50మంది ఆందోళకారు లు మృతి చెందారు. ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోలేదంటూ ఆరోపించారు. ఈ ఎన్నికలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఆందోళ న కార్యక్రమాలను ఉధృతం చేశారు. అనంతరం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం మరోసారి ఎన్నికలను నిర్వ హించాలని ఆదేశించింది. అధ్యక్ష ఎన్నికలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. అక్టోబర్‌ 26న ఎన్నికల నిర్వహణ తేదీని కూడా ఖరారైంది. అయితే, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణ యంపై రైలా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యాజ్యా న్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్టు ప్రకటించారు. దీంతో, దేశాధ్యక్షుడిగా కెన్యట్టా మరోసారి ప్రమాణం చేశారు. కెన్యాలో 19.6 మిలియన్ల మందికి ఓటు హక్కు ఉన్నది. వారిలో కేవలం 7.6మిలియన్ల మంది మా త్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కెన్యా దేశాధ్యక్షుడిగా కెన్యట్టా ప్రమాణం చేసే క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. ప్రమాణ స్వీకారం జరుగుతున్న కసరానీ స్టేడియం వద్దకు చేరుకున్న ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. భాష్పవాయుగోళాలు ప్రదర్శించారు. దీంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. స్థానిక మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com