ఇజ్రాయిల్లో భారీ అగ్ని ప్రమాదం...నలుగురు మృతి
- November 28, 2017
జెరూసలేమ్ : ఇజ్రాయిల్‌లోని టెల్‌అవీవ్ నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలు, అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలి వద్ద మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేసే పనిలో నిమగమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలం వద్ద ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...టెల్‌అవీవ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి. వారిలో ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఓ భవనం పూర్తిగా కాలిపోయిందని, భవనం నుంచి అరుపులు కేకలు వినిపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







