కూతురి పనితీరుని మెచ్చుకుంటున్న ట్రంప్
- November 29, 2017
వాషింగ్టన్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో తన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగంపై అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత పర్యటనలో ఆమె మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అద్భుత పనితీరు కనబరుస్తున్నారని తనయపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్షుడి సీనియర్ సలహాదారు హోదాలో ఇవాంక భారత్‌లో పర్యటించడం ఇదే ప్రథమం అయినప్పటికీ గతంలో ఆమె ఇండియాను సందర్శించారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అమెరికా అందిస్తున్న సహాయ సహకారాలపై జీఈఎస్ సదస్సులో ఇవాంక ప్రసంగించారు. అందులో 20సెకన్ల నిడివి గల వీడియోను డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాజాగా ఇదే ట్వీట్‌ను ట్రంప్ తన వ్యక్తిగత ఖాతాలో ట్వీట్ చేస్తూ 'గ్రేట్ వర్క్ ఇవాంక' అని రాసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హేలీ సైతం ఇవాంకను ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష