దొంగతనం కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- November 29, 2017
మస్కట్: ఇద్దరు వలసదారుల్ని దొంగతనం కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేర్వేరు కేసుల్లో వీరిని నిందితులుగా ఉన్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న నేరానికిగాను ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అల్ కౌద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడి నుంచి గోల్డ్ ఆర్టెఫాక్ట్స్, డబ్బు, దొంగతనానికి ఉపయోగించే వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో పార్కింగ్ చేసిన ట్రక్స్ నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు కూడా ఆసియా జాతీయుడే కావడం గమనించదగ్గ అంశం. పార్క్ చేసిన ట్రక్స్‌నుంచి బ్యాటరీలను దొంగిలించడంలో నిందితుడు సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష