22 నకిలీ..మూతపడిన కంపెనీలపై దాడి చేసి 104 వీసాలు స్వాధీనం

- November 29, 2017 , by Maagulf
22 నకిలీ..మూతపడిన కంపెనీలపై  దాడి చేసి 104 వీసాలు స్వాధీనం

కువైట్:22 నకిలీ, మూసివేయబడిన కంపెనీ కార్యాలయాలపై నివాస వ్యవహారాల శాఖకు చెందిన అపరాధ పరిశోధకులు ఆకస్మిక  దాడులు జరిపి ఎటువంటి వ్యవహారాలు.. కార్మికులతో పనులు నిర్వహించని 22 నకిలీ, మూసివేయబడిన కంపెనీలు స్పాన్సర్ చేసిన 104 మంది కార్మికులను అదుపులోనికి తీసుకొని వారి వీసాలు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాక ఆయా కంపెనీలపై భద్రతాపరమైన ఆంక్షలు విధించబడ్డాయి, మరింత చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు. భవిష్యత్తులో వారు ఎటువంటి  వీసాలు జారీ చేయకుండా నిషేధించాయని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రజా సంబంధాలు మరియు భద్రతా మీడియా విభాగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com