సినాయ్ నుండి 7 లక్షల 45 వేల కాప్టాగోన్ మాత్రలను అక్రమ తరలింపు యత్నం

- November 30, 2017 , by Maagulf
సినాయ్ నుండి 7 లక్షల 45 వేల కాప్టాగోన్ మాత్రలను అక్రమ తరలింపు యత్నం

సౌదీ అరేబియా: టబుకి జలాల వద్ద 745,000  కాప్టాగోన్ మాత్రలను ఒక పడవలో అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను సరిహద్దు దళాలు పట్టుకున్నాయి. ఈ విషయమై సరిహద్దు దళాల ప్రతినిధి కల్నల్ సాహ్ర్ బిన్ మొహమ్మద్ అల్-హర్బి మాట్లాడుతూ మంగళవారం సౌదీ జలాలను చేసురుకొనే లక్ష్యంగా కొందరు అక్రమ రవాణాదారులను సముద్రపు గస్తీ దళాలను అడ్డుకున్నారు. ఆ మాత్రలను వారు నిర్దేశించుకున్న ప్రాంతంలో వదిలేందుకు యత్నిస్తూ ఈజిప్షియన్ జలాలకు తిరిగి చేరుకోవాలని  ప్రయత్నించినప్పుడు, సౌదీ గస్తీ దళం అడ్డుకొని తనిఖీ జరిపేరు. అందులో నిషేధించిన 7 లక్షల 45 వేల కాప్టాగోన్ మాత్రలను మాదక ద్రవ్యాలను పడవలో కనుగొన్నారు. ఇతర భద్రతాదళాల సహకారంతో అక్రమ రవాణాదారులైన ఇద్దరు ఈజిప్ట్ దేశస్తులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విషయంలో అవసరమైన విధానాలు తీసుకున్నారని అల్-హర్బి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com